Tips,Tricks ,remedies - Dharma Sandehalu : మంచి రోజులు రాబోయే ముందు ఈ 10 శుభ సంకేతాలు కనపడతాయట...!

Tips,Tricks ,remedies - Dharma Sandehalu : మంచి రోజులు రాబోయే ముందు ఈ 10 శుభ సంకేతాలు కనపడతాయట...!


పురాణాల ప్రకారం మనకి మంచి రోజులు రాబోయే ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
1. మొదటి శుభ సంకేతం  - మీ ఇంటికి నల్ల చీమలు వచ్చి వరుస కట్టి ఇంట్లోని ఏదైనా వస్తువుని తినడం మొదలుపెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అలాగే అపారమైన ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతమట.
2. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనబడితే అది కూడా శుభ సంకేతమే. మన జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థమట. అంతేకాకుండా కుటుంబానికి మేలు కలుగుతుందని సంకేతమట.
3. వాస్తు శాస్త్రం ప్రకారం పక్షి లేదా పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభ సంకేతంగా  చెప్పబడింది.కాబట్టి మీ ఇంట్లో పక్షి కానీ లేదా ఒక పురుగు కానీ గూడు కట్టుకుంటే అది ఎంతో శుభదాయకమని సంకేతం.అలాగే త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతోందని అర్థం.
4. పురాణాల్లో బల్లి లక్ష్మీదేవి రూపంగా వర్ణించబడింది. చాలామంది ఇంట్లో బల్లి కనపడగానే దానిని బయటికి తరమడానికి  ప్రయత్నిస్తారు. కానీ మన ఇంట్లో బల్లి కనపడడం శుభసంకేతమనే చెప్పాలి.అలాగే పూజ గదిలో బల్లి కనపడినప్పుడు దాన్ని సౌభాగ్యంగా భావించాలి.

5. ఒక బల్లిని మరొక బల్లి వెంబడించడం చూసినప్పుడు ఇంట్లో అభివృద్ధి జరగబోతోందని అర్థం. అంతే కాకుండా దీపావళి రోజున బల్లి తులసి చెట్టు దగ్గర కనిపిస్తే అత్యంత శుభదాయకంగా చెప్తారు. త్వరలోనే అపారమైన సంపద లభిస్తుందని దాని అర్థమట.
6. ఎడమ అర చేయి దురద పెట్టడం ధనప్రాప్తికి సూచకం. ఎప్పుడైనా ఎడమ అర చేయి దురద పెడితే మంచి లాభం కలుగబోతుందని అర్థం.

7. ఉదయం లేదా సాయంత్రం పూట శంఖం ఊదిన శబ్దం వినిపిస్తే త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతోందని సంకేతమట.
8. కలలో ఏనుగు, ముంగిస, శంఖము, బల్లి, గుడ్లగూబ, చీపురు, పిల్లల గ్రోవి,నక్షత్రము అలాగే పాము కనబడితే త్వరలోనే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతమట.

8. మనము ఏ పని మీద అయినా బయటకు వెళ్లేటప్పుడు  కుక్క తన నోటిలో ఆహారాన్ని తీసుకెళ్తున్నట్లుగా కనబడితే ఎక్కడి నుంచైనా మనకు ధనప్రాప్తి కలుగుతుందని సంకేతమట.
9. సాధారణంగా చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి కలలో చీపురు కనిపిస్తే త్వరలోనే ధనప్రాప్తి కలగబోతోందని సంకేతమట.

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Telugu Podupu Kathalu With Answers