Interesting Facts In Telugu : నది దాటేటప్పుడు డబ్బులు వేస్తున్నారా.....?
Interesting Facts In Telugu : నది దాటేటప్పుడు డబ్బులు వేస్తున్నారా.....?
సాధారణంగా చాలా మంది రైలులో లేదా బస్సు లో ప్రయాణించేటప్పుడు నదుల్లో మరియూ కాలువల్లో చిల్లర నాణేలు వేస్తూ వుంటారు. అసలు దాని అర్థం ఏంటో తెలుసా ? మన పూర్వీకులు అంటే మన తాత ముత్తాతలు రాత్రి పూట రాగి చెంబులో నీరు పోసి ఉంచి, ఉదయాన్నే తాగేవారు. అందుకే పాత తరం వారు అంత బలంగా, దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారు.
ఇక ఆ రోజుల్లో రాగి నాణేలు వాడుకలో ఉండేవి. కాబట్టి అప్పట్లో నదులు, కాలువలని దాటేటప్పుడు మనసులో గంగాదేవిని ప్రార్థించి ఆ రాగి నాణేలని నదులు, కాలువలు, చెరువుల్లో వేసేవారు. కేవలం పెద్దవారే కాకుండా పిల్లల చేత కూడా నదుల్లో రాగి నాణేలు వేయించేవారు. అలా రాగి నాణేలు వేసిన నీటిని తాగడం ఎంతో ఆరోగ్యకరం కాబట్టి ప్రజా సంక్షేమం కోసం వారు అలా చేసేవారు.
అయితే ప్రస్తుతం రాగి నాణేలు వాడుకలో లేవు. కాబట్టి ఇప్పుడు నదుల్లో, కాలువల్లో నాణేలు వేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. అయితే అదొక ఆచారంగా భావించి ఇప్పటికీ ప్రజలు ప్రయాణాల్లో నదులుని, కాలువలను దాటేటప్పుడు చెరువులలో, నదుల్లో నాణేలను వేస్తూ ఉంటారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి