Health Tips In Telugu : ఇలా కనుక చేశారంటే జీవితంలో మీకు ఎప్పటికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు....!
Health Tips In Telugu : ఇలా కనుక చేశారంటే జీవితంలో మీకు ఇక ఎప్పటికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు....!
సాధారణంగా చాలామంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఎన్ని మందులు, డాక్టర్లను మార్చినప్పటికీ ఎలాంటి ఉపయోగము ఉండదు. అలాంటివారు ఇక్కడ చెప్పిన సులువైన చిట్కాలు కనుక పాటించారంటే జీవితంలో ఎప్పటికీ మిమ్మల్ని గ్యాస్ బాధించదు.
1.ఉదయం లేవగానే ఒక లీటరుంపావు గోరువెచ్చని నీళ్ళని తాగాలి. ఒకేసారి అన్ని నీళ్లు తాగలేని వాళ్ళు 5,5 నిమిషాల గ్యాప్ తో ఒకటింపావు లీటర్ల గోరువెచ్చటి నీటిని తాగాలి. దానివల్ల ఫ్రీగా విరోచనం అయ్యి గ్యాస్ రిలీజ్ కాకుండా ఉంటుంది.
3. అలాగే ఉదయం టిఫిన్ తినేటప్పుడు కానీ మధ్యాహ్నం, రాత్రి అన్నం తినేటప్పుడు కానీ అవసరానికి తగినంత మంచినీరు మాత్రమే తాగాలి ఎక్కువగా మంచినీళ్లను తాగకూడదు. ఎందుకంటే సాధారణంగా మన శరీరంలో ఆహారం జీర్ణం అవ్వడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్, జీర్ణ రసాలు విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఆహారం తినేటప్పుడు ఒకవేళ అవసరానికి మించి ఎక్కువగా మంచినీళ్లు తాగితే ఆ జీర్ణరసాలు పలుచబడి ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుని పొట్టలో ఉన్న ఆహారం పులిసి గ్యాస్ రిలీజ్ అయి తేనుపుల ద్వారా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
4. అలాగే వీలైతే భోజనం చేశాక కనీసం రెండు గంటల వరకు మంచి నీళ్లు తాగకుండా ఉండాలి. అందువల్ల అన్నం త్వరగా జీర్ణమై గ్యాస్ రాకుండా ఆపుతుంది.అలాగే అన్నం తిన్న రెండు గంటల తర్వాత అరగంటకు ఒకసారి చొప్పున ఒక గ్లాసు మంచి నీళ్లు తాగితే గ్యాస్ మనల్ని ఇబ్బంది పెట్టదు.
5. ఇక మధ్యాహ్నం భోజనం చేశాక కనీసం నాలుగు గంటల వరకు ఎలాంటి చిరుతిళ్లు తినకుండా ఉండాలి.అప్పుడు భోజనం పూర్తిగా అరిగి గ్యాస్ విడుదల కాకుండా ఉంటుంది. ఈ చిట్కాలను కనుక మీరు ప్రయత్నించారంటే ఎలాంటి మందులు అవసరం లేకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి మీరు విముక్తిని పొందవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి