Gardening Tips In Telugu : బియ్యం కడిగిన నీళ్లల్లో ఇవి కలిపి మొక్కలకి పోస్తే...ప్రతిరోజు వందల్లో పూలు పూస్తాయి....!
Gardening Tips In Telugu : బియ్యం కడిగిన నీళ్లల్లో ఇవి కలిపి మొక్కలకి పోస్తే...ప్రతిరోజు వందల్లో పూలు పూస్తాయి....!
మనం ఇంట్లో పెంచుకునే గులాబీ మొక్కలు,మల్లె, మందార, సన్నజాజి మొదలైన మొక్కలకి ప్రతిరోజు వందల్లో పూలు పూయాలంటే ఇంట్లో ఎంతో సింపుల్ గా తయారు చేసుకున్న ఈ రూపాయి ఖర్చు లేని ఎరువు ను ఇస్తే ప్రతిరోజు 100 ల్లో పూలు పూస్తాయి.
ఎరువు తయారికి కావలసిన పదార్ధములు :
బియ్యం కడిగిన నీళ్లు, అరటి పళ్ళ తొక్కలు, కూరగాయ తొక్కలు మరియు ఉల్లిపాయ తొక్కలు. ముందుగా బియ్యం కడగ్గా వచ్చిన నీళ్ళని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా ఏదైనా ఒక బకెట్ లో కానీ పోసి దాంట్లో కూరగాయ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, అరటిపండు తొక్కలు వేసి ఒక 3,4 రోజులు పాటు అలాగే వదిలేయాలి.
5వ రోజు ఆ నీళ్లను ఒకసారి ఒక కర్ర సహాయంతో బాగా కలిపి ఒక మగ్గు తో ఆ నీళ్ళని పూల మొక్కల మొదట్లో కనుక పోసారంటే ఒకటో రెండో పూలు పూసే మీ పూల మొక్కలు ప్రతిరోజు వందల్లో పూలు పూస్తాయి. ఎలాంటి కెమికల్స్ లేని ఈ ఎరువు వల్ల పూల మొక్కలకి సహజ పోషకాలు అందీ వందల్లో పూలు పూస్తాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి