Dhanteras And Diwali 2023 : ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఆ రోజు ఇంట్లో చేయాల్సిన పనులు ఇవే....!
Dhanteras - Diwali 2023 : ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఆ రోజు ఇంట్లో చేయాల్సిన పనులు ఇవే....!
సాధారణంగా ధన్తేరస్ లేదా ధన త్రయోదశి పండుగను కి ముందు జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది ధన త్రయోదశి నవంబర్ 10న మధ్యాహ్నం 2.35 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే నవంబర్ 11 సాయంత్రం 6:40 నిమిషాల వరకు ఉంటుంది. ఈ ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మన ఇంట్లోని వారందరికీ ఆనందం,ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి, సంపద మెండుగా లభిస్తాయి అని భావిస్తారు.
అసలు ధన త్రయోదశి అంటే కుబేరుడి జన్మదినం. కాబట్టి ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవితో పాటు సంపదలకు దేవత
అయిన కుబేరుడిని కనుక పూజిస్తే చాలా మంచిది.ధంతేరస్ రోజున కుబేరుడిని పూజించడం వలన సంపదలకు దేవత అయిన కుబేరుడు ఎల్లప్పుడూ ప్రసన్నుడై మన మీద
కృప చూపుతాడని భావిస్తారు.
సాధారణంగా ధంతేరస్ లేదా ధన త్రయోదశి రోజున ఏవైనా బంగారు ఆభరణాలు లేదా వెండి నాణేలు కొనుగోలు చేస్తే మన ఇంట్లో అంతకంత బంగారం లేదా వెండి వృద్ధి చెందుతుందని భావిస్తారు. అయితే ధన త్రయోదశి రోజున కేవలం బంగారం లేదా వెండి కొనుక్కోవాలన్నది కేవలం మన అపోహ మాత్రమే. ధన త్రయోదశి రోజున మన తాహతను బట్టి ఏదో ఒక కొత్త వస్తువు కొనుక్కుంటే సరిపోతుంది.
ఆ కొత్త వస్తువు ఐదు రూపాయల పెన్ అయినా పుస్తకమైన, కొత్త చెంచా అయినా గ్లాసు లేదా ఏదో ఒక చిన్న స్టిల్ వస్తువైనా లేదా ఒక కొత్త కర్టెన్ అయినా లేదా బట్టలు, దుప్పటి లేదా ఒక చిన్న డోర్ మేట్ అయిన అలా మన తాహతును బట్టి ఒక కొత్త వస్తువుని కొనుక్కుంటే బంగారం కొనుక్కుంటే వచ్చేంత అభివృద్ధి మనకి కూడా తప్పకుండా లభిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి