Chiranjeevi - Tharun - Niharika Konidela - Naga Babu : త్వరలోనే మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్న హీరో తరుణ్ ?

Chiranjeevi - Tharun - Niharika Konidela - Naga Babu :
త్వరలోనే మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్న హీరో తరుణ్  ?


ఒకప్పుడు ఏడాదికి 4,5 సినిమాలతో బిజీగా ఉన్న హీరో తరుణ్. మొదట్లో తరుణ్ బాలేనటుడిగా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని పొందాడు. ఇక 2000 లో వచ్చిన నువ్వే కావాలి ( nuvve kavali) సినిమాలో తొలిసారిగా హీరోగా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు హీరో తరుణ్. ఇక ఆ తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, సోగ్గాడు, శశిరేఖ పరిణయం, నవవసంతం మొదలైన సినిమాల్లో నటించాడు.


2001లో వచ్చిన ప్రియమైన నీకు (priyamaina niku ) సినిమాలో తరుణ్ కి జంటగా హీరోయిన్ స్నేహ(sneha ) నటించింది. నిజ జీవితంలో స్నేహ తరుణ్ కంటే వయసులో పెద్దది.ప్రియమైన నీకు సినిమా తర్వాత తరుణ్, స్నేహలు మంచి ఫ్రెండ్స్ ఐపోవడమే కాకుండా ఆ తర్వాత వారిద్దరు ప్రేమలో పడ్డట్టు కూడా అనేక పుకార్లు వచ్చాయి.


కానీ తరుణ్ తల్లి రోజా రమణి(roja ramani)
స్నేహకు ఫోన్ చేసి తరుణ్ కి దూరంగా ఉండమని బెదిరించిందట. దాంతో స్నేహ తరుణ్ కి దూరం అయిపోయిందట. ఇక ఆ తర్వాత స్నేహ మరొకరిని వివాహం చేసుకొని వెళ్ళిపోయింది.


ఇక అలాగే నువ్వు లేక నేను లేను(nuvvu leka nenu lenu ) సినిమాలో ఆర్తీ అగర్వాల్ (ఆర్తి agarwal ) తరుణ్ కి జంటగా నటించింది. ఆ సినిమాలో నటించినప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక ఆ తర్వాత వారిద్దరూ అనేక పార్టీలకు కలిసి తిరిగారు. అయితే వీరి ప్రేమను తరుణ్ తల్లి రోజా రమణి,అలాగే ఆర్తి అగర్వాల్ తండ్రి ఒప్పుకోకపోవడంతో తరుణ్, ఆర్తి అగర్వాల్ దూరమైపోయారు.


ఇక ఆ సమయంలో ఆర్తి అగర్వాల్ బాత్రూమ్ లు కడిగే ఆసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కొన్ని రోజులపాటు కోమాలో ఉంది కూడా. ఆ తర్వాత కోలుకొని కొంత కాలం తర్వాత  వేరొకరిని వివాహం చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయింది ఆర్తి అగర్వాల్.


అయితే తరుణ్ మాత్రం 42 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉండిపోయాడు. చివరిగా తరుణ్ 2018 లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలో నటించినా ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో ఆ తర్వాత మరి ఏ సినిమాలోనూ కనిపించలేదు హీరో తరుణ్.


ఇక ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి హీరో తరుణ్ పెళ్లి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే తరుణ్ త్వరలో మెగా ఫ్యామిలీకి( mega family )
 అల్లుడు కాబోతున్నాడని దాంతో తరుణ్  చేసుకోబోయేది ఏ మెగా డాటరా అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో నాగబాబు(naga babu) కుమార్తె నిహారిక (niharika ) అలాగే మెగాస్టార్ చిరంజీవి( megastar chiranjeevi ) చిన్న కూతురు శ్రీజ ( srija konidela ) తమ భర్తల నుంచి విడాకులు తీసుకోవడంతో వీరిద్దరిలో ఎవరో ఒకరిని తరుణ్ వివాహం చేసుకుంటాడని నెటిజన్స్ అంతా అనుకుంటున్నారు. అయితే నెటిజన్స్ ఇలా అనుకోవడానికి కారణం హీరో తల్లి నటి రోజా రమణి (roja ramani ).


ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమారుడైన తరుణ్ అతి త్వరలోనే సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద కుటుంబానికి అల్లుడు కాబోతున్నాడని తరుణ్ తల్లి రోజా రమణి చెప్పింది. ఇక ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలు అంటే ముఖ్యంగా వెంకటేష్( venkatesh ), నాగార్జున( nagarjuna ), బాలకృష్ణ( bala krishna ) , చిరంజీవి ( chiranjeevi )కుటుంబాలే.


వెంకటేష్ పెద్ద కూతురికి వివాహం అయిపోయింది, మిగిలిన ఇద్దరు కూతుర్లు తరుణ్ కంటే వయసులో చాలా చిన్నవాళ్లు. నాగార్జునకి ఆడపిల్లలు లేరు, అలాగే బాలకృష్ణ కూతుర్లు ఇద్దరికీ వివాహాలు అయిపోయాయి.ఇక మిగిలింది చిరంజీవి కుటుంబం మాత్రమే కాబట్టి ప్రస్తుతం నిహారిక శ్రీజలు తమ భర్తల నుంచి విడాకులు తీసుకోవడంతో వీరిలో ఎవరో ఒకరిని తరుణ్ వివాహం చేసుకోబోతున్నాడు అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియా( social media ) లో తెగ వైరల్ ( viral ) అయిపోతోంది.


అయితే ఈ విషయం పైన తాజాగా హీరో తరుణ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ చేశాడు. అదేంటంటే తన పెళ్లి పై వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లేనని తను మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్నాడు అన్న వార్త అబద్దమని తన పెళ్లి నిశ్చయమైనప్పుడు తానే అందరికీ ఆ శుభవార్తను తెలియజేస్తానని ఒక పోస్ట్ పెట్టాడు.దాంతో తరుణ్ పెళ్లి పై వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని తేలిపోయింది  అలాగే మెగా ఫ్యామిలీ కూడా ఆ వార్తలన్నీ వట్టి పుకార్లేనని ఖండించింది.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Telugu Podupu Kathalu With Answers