Varun Tej - Lavanya Tripathi : Mega Hero వరుణ్ తేజ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది.....!

Varun Tej - Lavanya Tripathi : Mega Hero 
వరుణ్ తేజ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది.....!


జూన్ 9న మెగా హీరో వరుణ్ తేజ్ అలాగే హిరోయిన్ లావణ్య త్రిపాఠిలు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగ రంగ వైభవంగా ఎంగేజ్మెంట్  చేసుకున్న విషయం తెలిసింది కదా. వీరి ఎంగేజ్మెంట్ కి మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు లావణ్య త్రిపాఠి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.


అయితే మెగా ఫ్యామిలీలో ఒక పక్క వరుణ్ తేజ్ పెళ్లి నిశ్చయమైంది అన్న సంతోషం ఉన్న మరో పక్క నిహారిక విడాకులు వారి కుటుంబంలో కొంత అశాంతిని, బాధను కలగజేస్తోంది. ఇంతవరకు కేవలం పుకారు గానే ఉన్న నిహారిక, చైతన్యల విడాకులు జూలై 5న అధికారికంగా ప్రకటించబడటంతో మెగా అభిమానులు కూడా ఎంతో బాధపడ్డారు.


ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసనల కూతురైన క్లింకార గురించిన విశేషాలతో, వరుణ్ తేజ్ పెళ్లి సంబరంలో మెగా ఫ్యామిలీ సభ్యులు ఉన్నా మరో పక్క నిహారిక విడాకుల విషయం మెగా కుటుంబ సభ్యులను కొంత బాధకి గురి చేస్తూనే ఉంది.


ఇక ఈ సమయంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి తేదీ వెలువడిందన్న వార్తతో మెగా అభిమానులు కొంత సంబరపడుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల వివాహం ఆగస్టు 24న జరగబోతోందట. ఇక వీరి వివాహం ఇటలీలో జరుగుతుందన్న వార్త ప్రచారం అవుతోంది.


అంతే కాకుండా వీరి పెళ్లికి ఒక్కరోజు తర్వాత వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేయబోతున్నట్లుగా ఆ చిత్ర యూనిట్  తెలియజేసింది. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య వరుణ్ తేజ్ కి జంటగా నటిస్తోంది.అయితే వరుణ్ తేజ్ తన పెళ్లి హడావుడిలో ఉంటాడు కాబట్టి సినిమా ప్రేమోషన్స్ లో వరుణ్ తేజ్ పాల్గొనే అవకాశం లేనట్లే అని మెగా అభిమానులు అనుకుంటున్నారు.
< >

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Telugu Podupu Kathalu With Answers