Tips And Remedies In Telugu - మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతోందా? అయితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లే ...!
Tips In Telugu - Remedies In Telugu :
మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతోందా? అయితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లే ...!సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ కున్న దాంట్లో తమ కుటుంబంతో కలిసి హాయిగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఇంట్లో అంతా బాగున్నప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక కీచులాట తరచుగా వస్తూ ఉంటుంది. అకారణంగా ఒకరినొకరు దూషించుకోవడం లేదా ప్రతి చిన్న విషయానికి తప్పులు వెతికి గొడవ పడడం జరుగుతూ ఉంటుంది.
ఒక వేళ మీ ఇంట్లో కనుక ఈ పరిస్థితులు ఉంటే మీ ఇంట్లో తప్పకుండా నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే. అయితే ఈ నెగటివ్ ఎనర్జీని మీ ఇంట్లో నుంచి బయటికి పంపించాలంటే ఇక్కడ ఇచ్చిన, మీరు పాటించగలిగే కొన్ని సులువైన చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లో పరిస్థితులు మళ్లీ మామూలు స్థితికి వచ్చి అందరూ సంతోషంగా ఉండగలుగుతారు.
ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.చాలా మంది నిశ్శబ్దంగా ఉండడానికి ఇష్టపడతారు.కానీ అప్పుడప్పుడు కాస్త పెద్ద సౌండ్ తో దేవుడి పాటలు, స్తోత్రాలు లేదా సినిమా పాటలు, అలాగే సినిమాలు చూడడం లాంటివి చేయాలి. దానివల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీ తోటి ఇల్లు నిండుతుంది. అంతే కాకుండా మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.
ఇక అలాగే ఇంట్లో ఉన్న పాత వస్తువులు అంటే మనం వాడకుండా వదిలేసిన పాత చెప్పులు, బూట్లు, పుస్తకాలు, బట్టలు,వస్తువులు మొదలైనవి ఎప్పటికప్పుడు అవసరమైన వారికి దానం చేస్తూ ఉండాలి. అలా చేస్తే మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తప్పకుండా బయటికి వెళ్లిపోతుంది.
ఇక ఇంట్లో అప్పుడప్పుడు సెంటెడ్ క్యాండిల్స్ ని వెలిగిస్తే నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ తోటి ఇల్లంతా నిండుతుంది .
ముఖ్యంగా ఇంట్లో ఉండే వస్తువులను ఎప్పటికప్పుడు దులిపి శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మంచాల మీద ఉండే దుప్పట్లు, కప్పుకునే దుప్పట్లను కనీసం వారానికి ఒక్కసారి అయినా మారుస్తూ ఉండాలి. అప్పుడు ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్లిపోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది.
అలాగే అప్పుడప్పుడు అన్ని గదుల కిటికీల తలుపులు కాసేపు తెరిచి ఉంచితే స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి వచ్చి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి మనసంతా హుషారుగా ఉంటుంది.
ఇక చివరగా ప్రతి గది మూలల్లోనూ గుప్పెడు రాళ్ల ఉప్పును పెట్టి 48 గంటల తర్వాత ఆ ఉప్పుని తీసి బయట పడేయాలి. దాంతో నెగటివ్ ఎనర్జీ అంతా మన ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయి మన ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ తోటి నిండిపోతుంది. ఎందుకంటే రాళ్ల ఉప్పు మన ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని బయటికి తరిమికొట్టడంలో మనకు బాగా ఉపయోగపడుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి