Rashmika Mandanna - Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్నే కాదన్న రష్మిక...!

Rashmika Mandanna - Chiranjeevi :
మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్నే కాదన్న రష్మిక...!


2016 లో కిర్రిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది రష్మిక. కన్నడంలో కిర్రిక్ పార్టీ సూపర్ డూపర్ హిట్ అయి 2016లో కన్నడలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డును సృష్టించింది. అలాగే కిర్రిక్ పార్టీలో అద్భుతంగా నటించినందుకు గాను రష్మిక SIIMA అవార్డును గెలుచుకుంది.


2018 లో గీత గోవిందంలో విజయ్ దేవరకొండ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది రష్మిక. ఇక ఆ తర్వాత తెలుగులో డియర్ కామ్రేడ్, సరి లేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు, సీతారామం, పుష్ప మొదలైన సినిమాల్లో నటించింది.


ఇక పాన్ ఇండియా సినిమా అయిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా నటించిన రష్మిక ఆ సినిమా హిందీలో కూడా విడుదల కావడంతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ నే సంపాదించింది రష్మిక.


అంతే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరైన రష్మిక దేశవ్యాప్తంగా భారీ అభిమానులను కలిగి ఉండడంతో 2020 లో గూగుల్ ( GOOGLE )రష్మిక ని నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గా ప్రకటించింది.


ఇక ఇటీవల రష్మిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా రంగంలో అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఎంతో ముఖ్యమైనీ తెలిపింది. అలాగే ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల దక్షిణాదిలో కొన్ని సినిమాల్లో వచ్చిన ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది.


అయితే తను కొన్ని బాలీవుడ్ సినిమాల్లో బిజీగా  ఉండడం వల్ల ఒకప్పుడు చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలోనూ అలాగే తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాల్లోనూ నటించే అవకాశం వచ్చినా ఆ అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని అంత పెద్ద స్టార్స్ తో నటించే అవకాశాన్ని వదులుకోవాల్సి రావడం తనకు ఎంతో బాధను కలిగించిందని కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది రష్మిక.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Telugu Podupu Kathalu With Answers