Jeevitha - Raja Sekhar - Chiranjeevi - Allu Aravind : చిరంజీవిని విమర్శించినందుకు జీవిత రాజశేఖర్ లకు ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు
Jeevitha - Raja Sekhar - Chiranjeevi - Allu Aravind : చిరంజీవిని విమర్శించినందుకు జీవిత రాజశేఖర్ లకు ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దగా నిలబడుతూ, అన్ని కష్టాల్లోనూ అండగా ఉంటాడన్న విషయం చిరంజీవి గురించి తెలిసిన వారెవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో ఎంతో మందికి తన సహాయాన్ని అందజేశాడు చిరంజీవి. అలాగే వైద్య పరీక్షల నిమిత్తం తన దగ్గరికి వచ్చిన వారందరికీ తనకు చేతనైన సహాయం చేస్తూనే ఉంటాడు.అంతేకాకుండా చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా అవసరమైన వారందరికీ రక్తం అందేలా చూస్తాడు. అందుకుగానూ తన అభిమానులను ప్రోత్సహిస్తూ ఉంటాడు.
అయితే అలాంటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద రాజశేఖర్, జీవితలు ఒక మీడియా సమావేశంలో 2011లో తప్పుడు ఆరోపణలు చేశారు.దాంతో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రాజశేఖర్ దంపతుల మీద కోర్టులో పరువు నష్టం కేసుని 2011 లో దాఖలు చేశాడు.
అప్పుడు వేసిన కేసుకు దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయి సుధ, రాజశేఖర్ జీవిత దంపతులకు ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ సంచలనమైన తీర్పుని విడుదల చేసింది.
దాంతో పరువు నష్టం కేసు కింద జీవిత రాజశేఖర్ లకు నాంపల్లి కోర్టు ఒక ఏడాది పాటు జైలు శిక్ష, అలాగే Rs.5 వేల జరిమానా కూడా విధించింది. అయితే రాజశేఖర్ జీవితలు 5 వేల రూపాయల జరిమానా చెల్లించడంతో వారికి అప్పీలుకి అవకాశం ఇస్తూ జీవిత రాజశేఖర్ దంపతులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి