Bro Movie Pawan Kalyan - Sai Dharam Tej : పెద్ద తప్పు చేసి వివాదంలో చిక్కుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్
Bro Movie Pawan Kalyan - Sai Dharam Tej పెద్ద తప్పు చేసి వివాదంలో చిక్కుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్
ఈమధ్య ఏమైందో తెలియదు కానీ మెగా ఫ్యామిలీ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కి గురవుతూనే ఉంది. మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోయినట్లే అంటూ ఒక వార్త వైరల్ అయింది.
ఆ వార్త అలా ఉండగానే నాగబాబు కూతురు నిహారిక కాస్తా ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లాడిన తన భర్త చైతన్యకు విడాకులు ఇచ్చేసి మరోసారి ట్రోలర్స్ కి పని కల్పించింది. ఇక నిహారిక విడాకులు అఫీషియల్ గా ప్రకటించబడగానే మెగా ఫ్యామిలీ లోని ఆడపిల్లల పెంపకం సరిగా లేదని అందుకే అందరూ తమ భర్తలను వదిలేస్తున్నారంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఈ ఇక ఆ విషయం ఇంకా సద్దుమనగక ముందే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఒక పెద్ద తప్పు చేసి మళ్లీ మెగా ఫ్యామిలీని వివాదాల్లోకి లాగాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోలుగా బ్రో అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా!
ఇక ఆ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేయించాడట. అయితే ప్రత్యేక పూజలు చేస్తే తప్పేంటని అనుకుంటున్నారా ?అసలైన వివాదం ఇక్కడే ఉంది. అదేంటంటే బ్రో సినిమాని ఈ నెల 28న విడుదల చేయడానికి ఆ చిత్ర యూనిట్ సిద్ధంగా ఉంది.
అందుకని బ్రో సినిమా హిట్ అవ్వాలని శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేయించాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. అయితే ఆ పూజలో భాగంగా పూజ చేసే సమయంలో శ్రీకాళహస్తిలోని ఆలయంలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యస్వామికి తానే స్వయంగా హారతిని ఇచ్చాడట.
ఇక ఈ విషయం తెలియగానే పండితులు ఏ ఆలయంలో దేవుడికైనా నియమం ప్రకారం కేవలం అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలని భక్తులు ఎవరూ కూడా నేరుగా స్వామి వారికి హారతి ఇవ్వకూడదని సాయి ధరమ్ తేజ్ మీద మండిపడుతున్నారట. అయితే ఇప్పటిదాకా ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
Harathi este tappu enti dhevudu nuv naku harathi evvali ani vallaki cheppaledhu ga
రిప్లయితొలగించండి