Baby Movie - Vaishnavi Chaitanya - Hero Ram Pothineni : బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన హీరో రామ్ పోతినేని

Baby Movie - Vaishnavi Chaitanya - Hero Ram Pothineni :
బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన హీరో రామ్ పోతినేని


ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ముఖ్య తారాగణంగా వచ్చిన బేబీ మూవీ (baby movie ) థియేటర్లలో విడుదలైన తొలి వారంలోనే 50 కోట్ల క్లబ్ ను చేరుకుని ప్రస్తుతం 100 కోట్ల క్లబ్ లో చేరేందుకు బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. బేబీ సినిమాలో హీరోయిన్ అయిన వైష్ణవి చైతన్య మొదట్లో యూట్యూబ్ లో ఎన్నో వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించింది.


ఇక ఆ తర్వాత అల వైకుంఠపురం లో అల్లు అర్జున్ కి చెల్లెలుగా, ఇంకా రంగ్ దే, టక్ జగదీష్ , వరుడు కావలెను,  ప్రేమదేశం మొదలైన సినిమాల్లో పలు క్యారెక్టర్స్ లో నటించినప్పటికీ బేబీ సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించింది వైష్ణవి చైతన్య.
 అయితే బేబీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ప్రతి ఒక్కరూ బేబీ సినిమా హీరోయిన్ నటనకు ప్రశంసలు కురిపిస్తున్నారు.


దాంతో ఫిలింనగర్ లో ప్రతి ఒక్కరూ వైష్ణవి చైతన్య నటనకు ప్రశంసలు కురిపిస్తున్నారు.అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వైష్ణవి చైతన్య హాట్ టాపిక్ గా మారిపోయింది . ఎంతోమంది సెలబ్రిటీలు వైష్ణవి చైతన్యకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. వారిలో ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బేబీ మూవీ విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ ఆ చిత్ర బృందాన్ని అభినందించాడు. అంతే కాకుండా ప్రత్యేకంగా వైష్ణవి చైతన్య నటనని ఎంతగానో మెచ్చుకున్నాడు.


ఇక తాజాగా హీరో రామ్ పోతినేని కూడా బేబీ మూవీ చూశాడట. రామ్ కి వైష్ణవి చైతన్య నటన చాలా బాగా నచ్చడంతో బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడమే కాకుండా ఒక పూల బొకే ని కూడా వైష్ణవి చైతన్య ఇంటికి గిఫ్టుగా పంపించాడట హీరో రామ్.


ఇక హీరో రామ్ పోతినేని పంపిన పూల బొకేని చూసి ఉబ్బి తబ్బిబ్బైన వైష్ణవి ఆ విషయమే సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. పూల బొకేని పంపిన రామ్ కి సోషల్ మీడియా ద్వారా ఇంత అందమైన పూల బొకేతో నన్ను అలాగే బేబీ మూవీ యూనిట్ ని అభినందించినందుకు థాంక్స్ చెప్తూ ఒక పోస్ట్ పెట్టింది. ఇంకేముంది ఆ వార్త క్షణాల్లో వైరల్ అయిపోయింది.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Best Dog Bed in India Online at Amazon.in

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse