Allu Arjun - Sri Leela : అల్లు అర్జున్ తో Pushpa 2 లో నటించే అవకాశాన్ని కాదన్న శ్రీ లీల
Allu Arjun - Sri Leela : అల్లు అర్జున్ తో Pushpa 2 లో నటించే అవకాశాన్ని కాదన్న శ్రీ లీల
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న శ్రీ లీల జూలై 14, 2001లో USA లోని మిచిగాన్ లో పుట్టింది. ముందుగా కిస్ అనే కన్నడ చిత్రం ద్వారా తన నటనను ప్రారంభించింది. ప్రస్తుతం MBBS చివరి సంవత్సరం చదువుతోంది శ్రీ లీల.
2021లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి అనే సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీ లీల. ఆ సినిమాలో హీరో శ్రీకాంత్ కుమారుడైన రోషన్ కి జంటగా నటించింది శ్రీ లీల. ఆ తర్వాత హీరో రవితేజ సరసన ధమాకా అనే సినిమాలో నటించింది.ధమాకా సినిమా సూపర్ హిట్ అవడంతో శ్రీ లీలకి ఒక్కసారిగా తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి.
ప్రస్తుతం శ్రీ లీల తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటిస్తోంది. అంతేకాకుండా చెన్నై స్టోరీ (chennai story ) అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించబోతోందట శ్రీ లీల. ప్రస్తుతం శ్రీ లీల దాదాపు 7 సినిమాల్లో నటించడానికి ఒప్పుకుందట.
అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 లో అవకాశాన్ని మాత్రం రిజెక్ట్ చేసిందట శ్రీ లీల. సుమారు 7 సినిమాలు ఒప్పుకోవడంతో ఇంకో సంవత్సరం దాకా శ్రీ లీల డేట్స్ అన్ని బుక్ అయిపోయాయట. అందుకే పుష్ప 2 లో అల్లు అర్జున్ సరసన నటించే అవకాశాన్ని కాదందట శ్రీ లీల.
అయితే కేవలం డేట్స్ లేకపోవడం చేతే కాకుండా మరో కారణానికి కూడా శ్రీ లీల పుష్ప 2 లో నటించే అవకాశాన్ని కాదందట.అదేంటంటే పుష్ప 2 లో శ్రీ లీల కి పూర్తి నిడివి గల హీరోయిన్ క్యారెక్టర్ కాకుండా పుష్ప 1 లో సమంత చేసినట్టుగా ఒక ఐటమ్ సాంగ్ కోసం శ్రీ లీలని అడిగాడట ఆ సినిమా డైరెక్టర్ సుకుమార్.
దాంతో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో కేవలం ఒక ఐటమ్ సాంగ్ చేయడం ఇష్టం లేక పుష్ప టు లో అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం వచ్చినా డేట్స్ లేవని రిజెక్ట్ చేసేసిందట శ్రీ లీల.అయితే ఈ విషయం తెలిసిన వారంతా అల్లు అర్జున్ సరసన ఏ చిన్న అవకాశం వచ్చినా నటించాలని హీరోయిన్స్ అంతా ఆశ పడుతుంటే వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని కాదన్న శ్రీ లీలను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారట టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి