Tips, Tricks, Remedies : ఉప్పుతో ఇలా చేస్తే మీ అప్పులన్నీ తీరిపోయి అతి త్వరలో మీరే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు
Tips, Tricks, Remedies : ఉప్పుతో ఇలా చేస్తే మీ అప్పులన్నీ తీరిపోయి అతి త్వరలో మీరే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు
మనలో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ అవసరాల కోసం అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఎంతో సతమతమైపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం పురాణాల్లో మహర్షులచే చెప్పబడిన ఒక పరిహారాన్ని ఇక్కడ చెప్పబోతున్నాను. ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా ఎలాంటి అనుమానాలూ,శంకలు లేకుండా పాటిస్తే తప్పకుండా మీ అప్పులన్నీ తీరిపోయి వేరొకరికి మీరే అప్పులు ఇచ్చేంత స్థాయికి ఎదుగుతారు.
ఇక ఈ పరిహారానికి కావలసినదల్లా ఒక చిన్న మట్టి పాత్ర, అలాగే కళ్లుప్పు లేదా రాళ్ళ ఉప్పు మరియు ఒక రూపాయి బిళ్ళ. రాళ్ల ఉప్పుని కొన్ని ప్రాంతాల్లో దొడ్డు ఉప్పు అని అంటారు. అదే ఇంగ్లీషులో అయితే రాళ్ళ ఉప్పుని రాక్ సాల్ట్ అని అంటారు. ఇది మనకు అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది.
ఇక మట్టి పాత్ర ఎంత సైజుది అంటే సుమారు ఒక మీడియం గ్లాసు నీళ్లు పట్టేంత సైజుకి తీసుకోండి. ఆ తర్వాత ఆ మట్టి పాత్రని శుభ్రంగా కడిగి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టండి. ఇప్పుడు ఆ మట్టి పాత్రని రాళ్ల ఉప్పు తో పైన ఒక చిన్న కొండ లాగా వచ్చే లాగా నింపాలి. ఆ తర్వాత ఆ రాళ్ళ ఉప్పు పైన ఒక రూపాయి బిళ్ళని ఉంచాలి.
ఇలా రాళ్ల ఉప్పుతో నింపిన మట్టి పాత్రని వంటింట్లో గ్యాస్ స్టవ్ పక్కన ఆగ్నేయంలో పెట్టాలి. ఇలా మట్టి పాత్రని ఆగ్నేయంలో పెట్టాక ఆ మట్టి పాత్రని కదపడం గాని మట్టి పాత్రను తీసి కింద శుభ్రం చేయడం కానీ చేయకూడదు.
ఇక అలా ఆ మట్టి పాత్రను ఆగ్నేయంలో పెట్టాక ఒక్కసారి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని తలుచుకుని మట్టి పాత్రకి నమస్కరించి అమ్మా మాకు ఉన్న కష్టాలు అప్పులు తీరిపోయి మేము సుఖంగా సంతోషంగా ఉండేటట్లు మమ్ము కరుణించు తల్లి నువ్వు ఎప్పటికీ మమ్మల్ని విడిచి వెళ్ళకమ్మ నీ కటాక్షాన్ని ప్రసాదించు తల్లి అని నమస్కరించి ఆ మట్టి పాత్రని ఆగ్నేయ మూలన అలా వదిలేయాలి.
ఇక మట్టి పాత్రను అలా ఎన్ని రోజులు వదిలేయాలి అంటే ఆ మట్టి పాత్రలో ఉన్న ఉప్పును బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఆ మట్టి పాత్రలోని ఉప్పు రంగు మారడానికి మూడు రోజులకు పెట్టొచ్చు, లేదా ఐదు రోజులు పట్టొచ్చు లేదా ఇంకొన్నిసార్లు పది రోజులు లేదా ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మట్టి పాత్రలోని రాళ్ల ఉప్పు రంగు మారడానికి ఒక ప్రత్యేక కాలం అంటూ ఉండదు.
ఇక అలా మట్టి పాత్రలోని రాళ్ల ఉప్పు లేత ఆకుపచ్చ రంగులోకి ఎప్పుడు మారితే అప్పుడు ఒక్క గురువారం, శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో అంటే ఆది, సోమ, మంగళ, బుధ,శనివారాల్లో ఏదో ఒక రోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి మట్టి పాత్రలోని రాళ్ల ఉప్పు మీద ఉన్న రూపాయి బిళ్ళను తీసి మనం ప్రతిరోజు పూజించే తులసి కోటలో వేసేయాలి.
ఇక ఆ తర్వాత మీకు కనుక ఒక వేళ పెరడు ఉంటే అక్కడ ఒక చిన్న గొయ్యి తీసి ఆ రాళ్ళ ఉప్పు పాత్రను మట్టి పాత్ర తో సహా అందులో పాతేయాలి.
అయితే ప్రస్తుతం చాలామంది అపార్ట్మెంట్లలో ఉండడం వల్ల పెరడు లేని వారు ఆ మట్టి పాత్ర పట్టేంత ఒక చిన్న సైజు పూలకుండీని కొని దాంట్లో కొంచెం మట్టి వేసి ఈ రాళ్ళ ఉప్పు ఉన్న పాత్రను పెట్టి ఆ మట్టి పాత్ర పైకి కనిపించకుండా పూర్తిగా మట్టితో నింపేయాలి.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే కేవలం మట్టి పూల కుండీని మాత్రమే కొనాలి ఎలాంటి ప్లాస్టిక్ పూల కుండీనీ వాడకూడదు.
ఇక అలా మట్టి పాత్రని పూలకుండీలో మట్టితో కప్పెట్టాక బయట మీ ఇంటి కాంపౌండ్ లో ఏదో ఒక మూల ఒక నెల రోజులపాటు ఉంచేయాలి.
అలా ఒక నెల రోజులు గడిచాక గురువారం, శుక్రవారం కాకుండా మిగతా ఏదో ఒక రోజులో ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి ఆ పూలకుండీని మొత్తంగా అలాగే తీసుకెళ్లి బయట వీధిలో ఉండే డస్ట్ బిన్ లో పడేయాలి.
అంతే అలా రాళ్ళ ఉప్పు రంగు మారేవరకు ఉంచి పైన చెప్పిన విధంగా చేస్తే మీ అప్పులు కచ్చితంగా తీరే అవకాశం ఉంటుంది లేదా అప్పులు తీర్చేందుకు ఏదో ఒక మంచి మార్గం కనబడుతుంది.
అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం మీ కుటుంబం మొత్తానికి కలుగుతుంది.
చేసిన అప్పులన్నీ తీరిపోవడానికి ఇది పురాణాల్లో మహర్షిలచే చెప్పబడిన ఒక పరిహారం. కాబట్టి తప్పకుండా ప్రయత్నించి చూడండి. అంతేకాకుండా ఈ పరిహారానికి పెద్దగా ఖరీదైన వస్తువులు ఏవి అక్కర్లేదు కాబట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి నమస్కరించుకుని తప్పకుండా ఈ పరిహారాన్ని ప్రయత్నించండి.
అయితే ఈ పరిహారాన్ని ప్రారంభించే ముందు మనసులో ఎలాంటి అనుమానాలూ,శంకలూ లేకుండా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ మహాలక్ష్మిని తలచుకుంటూ ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి మీకు మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమో నమః.
Thank u frnd
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇంతటి విలువైన సమాచారమును తెలియచేసినందుకు ధన్యవాదాలు
రిప్లయితొలగించండి