Tips,Tricks And Remedies For Headache : ఇలా చేశారంటే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది
Tips,Tricks And Remedies For Headache : ఇలా చేశారంటే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది
మామూలుగా మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. సాధారణంగా ఒత్తిడి, అధిక శ్రమ, నిస్సత్తువ, పంటి సమస్యలు, కంటి సమస్యలు, హార్మోన్ల ప్రభావం, ఎక్కువ సేపు టీవీ చూడడం, కంప్యూటర్ చూడడం మొదలైన వాటి వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది.
అయితే చాలామంది తల నొప్పి రాగానే వేరే ఆలోచన లేకుండా వివిధ పెయిన్ కిల్లర్స్ లేదా నొప్పి నివారణి మందులని వాడేస్తూ ఉంటారు. అయితే తరచుగా ఇలా పెయిన్ కిల్లర్స్ ని వాడడం మన ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఇలా తరచుగా పెయిన్ కిల్లర్స్ ని వాడడం వలన మన శరీరంలో అనేక దుష్ప్రభావాలు ఏర్పడతాయి.
కానీ వీటన్నిటికంటే ఎంతో సులువైన ఎలాంటి అపాయమూ లేని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా తలనొప్పిగా ఉన్నప్పుడు ముందుగా చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఆ తర్వాత చీకటిగా, నిశ్శబ్దంగా ఉన్న గదిలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. అలా చేస్తే కొన్నిసార్లు వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది.
ఇక తలపోటు బాగా ఉన్నప్పుడు అల్లం కషాయం తాగితే వెంటనే ఉపశమనం పొందవచ్చు. అల్లం కషాయం రక్తనాళాలను సడలించీ మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఏ అల్లం కషాయాన్ని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.
ముందుగా స్టవ్ ని వెలిగించీ దానిమీద ఒక గిన్నె పెట్టి అందులో రెండు కప్పులు నీళ్లు పోసి ఆ నీళ్లల్లో ఒక అంగుళం ముక్క అల్లాన్ని బాగా దంచి వేయాలి. ఆ తర్వాత ఆ రెండు కప్పుల నీళ్లని ఒక కప్పుగా అయ్యేంతవరకు బాగా మరిగించాలి. ఇప్పుడు అలా తయారైన అల్లం కషాయాన్ని ఒక గ్లాసులోకి వడ పోసుకుని తాగాలి.
కావలసినవారు ఇందులో ఒక చెంచాడు తేనెను కలుపుకోవచ్చు. ఈ అల్లం కషాయం కాస్త వేడిగా ఉండగానే తాగాలి.ఈ అల్లం కషాయం తలనొప్పిని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
నిమ్మరసం :
అలాగే తల నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడే మరో అద్భుతమైన ఔషధం నిమ్మరసం. మనకి అకస్మాత్తుగా వచ్చే తలనొప్పిని నివారించడంలో నిమ్మరసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిమ్మరసం దాదాపుగా అన్ని రకాల తలనొప్పుల నుంచి సత్వరమే మనకు ఉపశమనాన్ని
కలిగిస్తుంది.ఈసారి మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఈ నిమ్మరసం చిట్కాని తప్పకుండా ట్రై చేసి చూడండి.
నిమ్మరసాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా రెండు కప్పుల నీటిని స్టవ్ మీద బాగా మరిగించీ దాంట్లో గింజలు తీసేసిన ఒక పూర్తి నిమ్మకాయ రసాన్ని లేదా అర చెక్క నిమ్మ రసాన్ని వెయ్యాలి. ఆ రెండు కప్పుల నీరు ఒక్క కప్పు అయ్యే దాకా ఉంచి ఒక గ్లాసులో పోసుకోవాలి. ఈ నిమ్మరసం కాస్త వేడిగా ఉండగానే తాగాలి. అంతే దాదాపు 5 నిమిషాల్లోనే తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి