Tips For Good Sleep : పడుకున్న వెంటనే గాఢ నిద్ర రావాలంటే ఇలా చెయ్యండి

Tips  For Good Sleep : పడుకున్న వెంటనే గాఢ నిద్ర రావాలంటే ఇలా చెయ్యండి


మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకి కేవలం మంచి ఆహారమే కాకుండా మంచి నిద్ర కూడా ఎంతో అవసరం. మనలో చాలా మంది రాత్రి పూట సరిగ్గా నిద్రపోలేక ఎంతో అవస్థ పడుతూ ఉంటారు. రాత్రిపూట మనకి సరిగా నిద్ర పట్టనప్పుడు మర్నాడు చిరాకు,తలనొప్పి, విసుగు, అలసట, కళ్ల మంటలు మొదలైన ఇబ్బందులు వస్తాయి.


ఇక రాత్రిపూట బాగా నిద్రపట్టాలనుకునేవారు నిద్రపోవడానికి కనీసం అరగంట ముందు నుంచే సెల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్, కంప్యూటర్ చూడడం ఆపేయాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వచ్చే కాంతి కారణంగా మనకి నిద్ర చెడిపోతుంది.


ఇక ముఖ్యంగా ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించాలి. అలాగే కనీసం ప్రతిరోజు 6 నుంచి 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించాలి.


ఇక అన్ని సూపర్ మార్కెట్స్ లోనూ, కిరాణా షాపుల్లోనూ మనకి ఎంతో సులువుగా లభించే గసగసాలు నిద్రలేమితో బాధపడే వారికి మంచి నిద్ర కోసం బాగా ఉపయోగపడతాయి.గసగసాలు కలిపిన పాలను తాగడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి నిద్రను పొందవచ్చు.


ఇక గసగసాల పాల కోసం కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాము.
పాలు - 1 కప్పు
గసగసాలు - 2 టీ స్పూన్లు 
బెల్లం పొడి - 1 టీ స్పూన్


ముందుగా రెండు టీ స్పూన్ల గసగసాలను గోరువెచ్చటి నీటిలో ఒక 15 నిమిషాల పాటు నానబెట్టాలి గసగసాలు బాగా నానాక నీళ్లను వడపోసి గసగసాలను విడిగా తీసి పెట్టుకోవాలి.


ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో రెండు కప్పుల పాలు పోసి నానబెట్టిన గసగసాలను ఆ పాలలో వేసి మీడియం మంట మీద ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి.


ఆ తర్వాత ఆ పాలలో ఒక టీ స్పూన్ బెల్లం పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఆ పాలను ఒక గ్లాసులో పోసుకుని కాస్త వేడిగా ఉన్నప్పుడే తాగేయాలి. ఇలా చేశారంటే గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. గసగసాలు ఒత్తిడి స్థాయిని తగ్గించి మనకు మంచి నిద్రనివ్వడంలో తోడ్పడతాయి. 






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!