Guppedantha Manasu Serial లోని వసుధార మిస్ యూనివర్స్ కాబోయి సీరియల్ నటి ఎందుకు అయ్యింది ?

Guppedantha Manasu Serial లోని వసుధార మిస్ యూనివర్స్ కాబోయి సీరియల్ నటి ఎందుకు అయ్యింది ?
  


ఒక ప్రముఖ TV ఛానల్ లో ప్రసారమౌతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సీరియల్ గుప్పెడంత మనసు. గుప్పెడంత మనసు సీరియల్ ప్రధాన కథనం బెంగాలీ భాష సీరియల్ అయిన మోహోర్ నుండి తీసుకోబడింది.



ఇక గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న వసుధార అసలు పేరు రక్షా గౌడ. రక్షా గౌడ 7 సెప్టెంబర్,1996లో కర్ణాటకలోని బెంగళూరులో పుట్టింది. రక్షా గౌడ జైన్ యూనివర్సిటీ నుంచి బీబీఏ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. 


రక్షా గౌడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాక్టింగ్ లో తనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదని తను సీరియల్స్ లో నటించే ముందు వరకు స్కూల్లో , కాలేజీలో ఒక స్కిట్ లో కానీ డ్రామాలో కానీ నటించలేదని అంతేకాకుండా తనకు అసలు నటన మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదని చెప్పింది.


తమ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు అనుకోకుండా ఒక సీరియల్ ప్రొడ్యూసర్ కి తన ఫొటోస్ ని షేర్ చేశారని ఆ ప్రొడ్యూసర్ కి తన ఫొటోస్ నచ్చడంతో సీరియల్స్ లో తనకి అనుకోకుండా అవకాశం వచ్చిందని చెప్పింది రక్షా గౌడ.



చిన్నప్పటి నుంచి తను ఒక మంచి సక్సెస్ ఫుల్  మోడల్ గా పేరు తెచ్చుకుని మిస్ యూనివర్స్  టైటిల్ కి పోటీ చేయాలని కలలు కనేదాన్ననీ అయితే అనుకోకుండా వచ్చిన సీరియల్ అవకాశం తో నటన వైపుకు తన ఇంట్రెస్ట్ మార్చుకున్నాను అని చెప్పింది రక్షా గౌడ.


అలాగే సీరియల్స్ లో తనకు అవకాశం వచ్చినప్పుడు తనకు నటనలో సున్నా అనుభవం ఉందని అయితే ఒకసారి సీరియల్ లో నటించడం మొదలుపెట్టాక తన నటనను ఇంప్రూవ్ చేసుకున్నానని చెప్పింది. అంతేకాకుండా తనమీద ప్రేక్షకులు చూపించే అభిమానాన్ని చూశాక మరింత కష్టపడి నటించి మంచి పేరు తెచ్చుకోవాలన్న కోరిక ఏర్పడిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది రక్ష గౌడ.


ఇక తనకి షూటింగ్స్ లేనప్పుడు ఫ్రెండ్స్ తో అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తానని అలాగే తన హాబీస్ అయిన పెయింటింగ్ మరియు డాన్స్ ని ప్రాక్టీస్ చేస్తానని చెప్పింది. తనకి ఇంకా మౌంటెన్ క్లైంబింగ్, లాంగ్ డ్రైవ్స్, జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది రక్షా గౌడ.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!