Dhanvantari Mantram : ఎలాంటి అనారోగ్యాన్ని అయినా తొలగించీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ధన్వంతరి మంత్రం

Dhanvantari Mantram : ఎలాంటి అనారోగ్యాన్ని అయినా తొలగించీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ధన్వంతరి మంత్రం


శ్రీ మహావిష్ణువు అవతారమైన ధన్వంతరిని ఆయుర్వేద వైద్య పితామహునిగా భావిస్తారు. ఎలాంటి అనారోగ్యాన్ని అయినా తొలగించీ సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది ధన్వంతరి మంత్రం.
ఎన్ని మందులు వాడినా వ్యాధి నయం కాకపోతే ప్రతిరోజు ధన్వంతరి మంత్రాన్ని పఠిస్తే తప్పకుండా అనేక దీర్ఘకాలిక వ్యాధులు నుంచి ఉపశమనాన్ని  పొందవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి.


పురాణాల ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ధన్వంతరి మంత్రాన్ని పఠిస్తే ఆ వ్యాధుల నుంచి తప్పకుండా ఉపశమనం పొందవచ్చునని సూచిస్తున్నాయి.


ధన్వంతరి మంత్రాన్ని భక్తితో పఠించిన వారికి దీర్ఘాయువును కలిగిస్తుంది. ఈ ధన్వంతరి మంత్రాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కానీ లేదా అతనికి సంబంధించిన వారు ఎవరైనా కూడా ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించవచ్చు.


ధన్వంతరి మంత్రం ఎంతో శక్తివంతమైన మంత్రం. భక్తిశ్రద్ధలతో అలాగే గట్టి నమ్మకంతో ఈ ధన్వంతరి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించిన వారికి ఇప్పటికే వారికి ఉన్న వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యల నుండి తప్పకుండా బయటపడవచ్చు అని పురాణాల్లో సూచించబడింది.


అత్యంత శక్తివంతమైన ధన్వంతరి మంత్రాన్ని పఠిoచడం వలన అన్ని భయాలు, బాధలు, వ్యాధుల నుండి మానవులు ఉపశమనం పొందగలరని పురాణాల్లో చెప్పబడింది.


 ధన్వంతరి మంత్రం :
 ఓం నమో భగవతే మహా సుదర్శనాయ
 వాసుదేవాయ  ధన్వంతరయే
 అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశాయ
 సర్వరోగ నివారణాయ త్రైలోక్య పతయే
 త్రైలోక్య నిధయే శ్రీమహావిష్ణు స్వరూప
 శ్రీ ధన్వంతరీ స్వరూప శ్రీశ్రీశ్రీ ఔషధ చక్ర నారాయణాయ స్వాహా



ఈ ధన్వంతరి మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 27 సార్లు మనస్ఫూర్తిగా నమ్మకంతో నాకున్న వ్యాధులు తొలగిపోయి నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని కావాలనే నమ్మకంతో పఠిస్తే అద్భుతమైన ఫలితాన్ని మీరే చూస్తారు.


పైన ఇచ్చిన మంత్రము సరిగ్గా నోరు తిరగదని అనుకున్న వారు ఈ కింద ఇచ్చిన మంత్రాన్ని అయినా ప్రతిరోజు మనస్ఫూర్తిగా 27 సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు.
ఓం నమో భగవతే
ధన్వంతరయే
అమృత కలశ హస్తాయ
సర్వామయ వినాశనాయ
త్రైలోక్య నాథాయ
శ్రీమహావిష్ణువే నమః 






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Telugu Podupu Kathalu With Answers