Brahmamudi Telugu Serial Hero Manas Nagulapalli నంది అవార్డును అందుకున్నాడన్న విషయం మీకు తెలుసా ?

Brahmamudi Telugu Serial Hero Manas Nagulapalli నంది అవార్డును అందుకున్నాడన్న విషయం మీకు తెలుసా ?



ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి తెలుగు టీవీ సీరియల్ మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి ఏడున్నర గంటలకు స్టార్ మా టీవీ ఛానల్ లో ప్రసారమవుతుంది. ఇంతటి ప్రేక్షకాదరణ పొందిన బ్రహ్మముడి సీరియల్ కథనం స్టార్ జల్సా ఛానల్ లో ప్రసారమయ్యే బెంగాలీ టీవీ సీరియల్ గచోరా నుంచి స్వీకరించబడింది.


బ్రహ్మముడి సీరియల్ లో మానస్ నాగులపల్లి, శ్రీకర్ కృష్ణ, కిరణ్ కాంత్, దీపిక రంగరాజు, హామీదా ఖాతూన్ మొదలైన వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ నాగులపల్లి ఆగస్టు 2,1991లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పుట్టాడు.


అయితే మానస్ తండ్రి ఉద్యోగరీత్యా ముంబైలో ఉండేవారు.మానస్ తల్లి మహిళా మరియు పిల్లల హక్కుల కార్యకర్త.అంతేకాకుండా ఆవిడ హైదరాబాదులోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) మాజీ సభ్యురాలు కూడా. మానస్ హైదరాబాదులోని గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో    B. Tech లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.


2001 నుంచి తెలుగు సినిమాల్లో తన నటనను ప్రారంభించాడు మానస్. మొట్టమొదటగా 2001లో బాలకృష్ణ హీరోగా వచ్చిన నరసింహనాయుడు సినిమాలో బాల నటుడిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన నటనను ప్రారంభించాడు. ఆ తర్వాత మానస్ వీడే, అర్జున్ మొదలైన సినిమాల్లో బాల నటుడిగా నటించాడు.


ఇక 2014 లో ఝలక్ అనే సినిమాలో మొట్టమొదటగా హీరోగా నటించాడు. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, ప్రేమికుడు, సోడా గోలి సోడా మొదలైన సినిమాల్లో నటించాడు మానస్.


ఇక 2019లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన  కోయిలమ్మ అనే సీరియల్ ద్వారా తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టాడు. మానస్ 2021 లో నాగార్జున అక్కినేనిచే హోస్ట్ చేయబడిన ప్రముఖ  రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో పాల్గొని మూడో స్థానంలో నిలిచాడు.


ఇక ఆ తర్వాత మానస్ దూరదర్శన్ లో ప్రసారమైన భలే ఛాన్స్ లే,పితృ దేవో భవ మొదలైన సీరియల్స్ లో కూడా నటించాడు. అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కార్తీకదీపం మొదలైన సీరియల్స్ లో కూడా నటించాడు.


మానస్ నాగులపల్లి కేవలం నటుడే కాకుండా మంచి డాన్సర్ కూడా. మానస్ డాన్స్ మీద మక్కువతో అనేక డాన్స్ రియాలిటీ షోలలో తరచుగా పాల్గొంటూ ఉంటాడు. అలాగే ఒక ఛానల్ లో ప్రసారమైన ప్రియమైన అమ్మకు అనే ప్రోగ్రాంకి హోస్టుగా కూడా చేశాడు మానస్.


2001లో మానస్ నాగులపల్లి బాల నటుడిగా నటించిన నరసింహనాయుడు సినిమాలో తన  అసాధారణ నటనకు గానూ తొలి చిత్రం లోనే నంది అవార్డును గెలుచుకున్నాడు.  అలాగే 2023 మే లో రిలీజ్ అయిన ప్యారా కుల్హాద్ అనే హిందీ సినిమాలో కూడా హీరోగా నటించాడు మానస్ నాగులపల్లి.

 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Telugu Podupu Kathalu With Answers