Tollywood : Anchor Udaya Bhanu భర్త ఒక సాధారణ కార్ డ్రైవరా ? Udaya Bhanu రెండు పెళ్లిళ్లు చేసుకుందా?
Tollywood : Anchor Udaya Bhanu భర్త ఒక సాధారణ కార్ డ్రైవరా ? Udaya Bhanu రెండు పెళ్లిళ్లు చేసుకుందా?
మోస్ట్ ఫెమిలియర్ యాంకర్ మరియు యాక్టర్ అయిన ఉదయభాను కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో పుట్టింది. మొట్టమొదటగా ఉదయభాను 10th క్లాస్ లో ఉండగా ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన హృదయాంజలి అనే షో ద్వారా టీవీ రంగంలోకి ప్రవేశించింది.
ఉదయభాను తండ్రి S.K.పటేల్ ఒక డాక్టర్ మరియు తల్లి అరుణ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్. ఉదయభాను తండ్రి కేవలం డాక్టరే కాకుండా ఒక మంచి కవి కూడా ఆయన కలం పేరు ఉదయభాను. తన కలం పేరుని ఆయన తన కూతురికి పేరుగా పెట్టుకున్నాడు.
దురదృష్టవశాత్తు ఉదయభాను కి నాలుగేళ్ల వయస్సు అప్పుడే తండ్రి చనిపోయాడు తర్వాత ఉదయభాను తల్లి ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా ఉదయభాను తల్లి ఉదయభాను కి 15వ ఏటనే ఒక ముస్లిం కి ఇచ్చి వివాహం చేసేసింది. అయితే ఉదయభాను కి ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఆ తర్వాత విడాకులు తీసుకుంది.
ఉదయభాను మొట్టమొదటగా పదవ తరగతి చదువుతున్నప్పుడు ఎర్రసైన్యం అనే తెలుగు సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఉదయభాను కొన్ని తమిళ కన్నడ, సినిమాల్లో నటించింది.
ఇక తెలుగులో ఉదయభాను లీడర్, కొండపల్లి సింహాసనం, ఆపద మ్రొక్కులవాడు, శ్రావణమాసం, ఖైదీ బ్రదర్స్ మొదలైన సినిమాల్లో నటించింది. ఇక ఉదయభాను పాల్గొన్న టీవీ కార్యక్రమాల గురించి చూస్తే పలు టీవీ చానల్స్ లో వచ్చిన హృదయాంజలి, వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింభకా, డాన్స్ బేబీ డాన్స్, రేలా రే రేలా, ఢీ రియాలిటీ డాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలా పిడుగులా వంటి అనేక ప్రోగ్రామ్స్ లో నటించింది.
ఇక ముస్లిం అయిన మొదటి భర్త తో విడాకుల అనంతరం ఉదయభాను విజయకుమార్ అనే అతడిని తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంది. అయితే విజయ్ కుమార్ ఉదయభాను వాళ్ళ కారు డ్రైవర్ అని అప్పట్లో టాలీవుడ్ లో పుకార్లు వినిపించాయి.
అంతేకాకుండా కార్ డ్రైవర్ ని వివాహం చేసుకోవడం వల్ల ఉదయభాను పేరు ప్రతిష్టలు దెబ్బతిని ఎన్నో మంచి సినీ అవకాశాలను అలాగే టీవీలో పలు కార్యక్రమాల అవకాశాలను పోగొట్టుకున్నట్లుగా అప్పట్లో అనేక పుకార్లు వినిపించాయి.
ఇక ఉదయభాను విజయకుమార్ కి ఇద్దరు కవల ఆడ పిల్లలు పుట్టారు. వారికి యువీ నక్షత్ర, భూమీ ఆరాధ్య అనే అందమైన పేర్లు పెట్టుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి